Friday, 18 July 2014

ఆర్కే||ఆత్మ - దేహం || 

నీలోనే ఉంటాను 
నాతో చెప్పావ్, 

కన్నీటితో కట్టిన మేడ
వడగండ్ల తలుపులు 
కడగండ్ల కిటికీలు
తలగడ దిండ్లన్ని తడుపుతూ "కాపురం"
ఎక్కడూడ్చిన "నీళ్ళే".

రావద్దన్నా వస్తావు నీవు
మనిషిగా కాదు, గుర్తుకి, కేవలం జ్ఞప్తికి,
కొనూపిరితో కొట్టుకుంటున్ననన్ను
కాలగర్భంలో కలిపెయ్యటానికి.

దేహం కాలిపోతుంటే
కనీసం *గంటలకారు
కోసమైనా కబురంపని
ఆత్మ ఉంటే ఏమిటి పోతే ఏమిటి!

పావురం ఎగిరిపోయింది
పంజరం మిగిలి పోయింది
పరస్పర నిందలకు
గమనాగమనాలు మన చేతుల్లో ఉంటేగా!!

సర్వీశ్వర త్రాహిమం
పాహిమాం ఈ శేషం.

ఆర్కే||ఆత్మ - దేహం ||20140716||
బుంగలు-9
--------- -----------------
*గంటలకారు - ఫైరింజన్



ఆర్కే||కోవెల||

కుక్క కాలిడిన మాత్రాన 
కోవెల కల్మషమైపోదు 
యదలో లేని పశ్చాత్తాపం 
ఎదుట పడినప్పుడు చూపెడితే 
అస్తిత్వానికి అది సరిగ్గా అతకబోదు.

మాటలో వదిలించుకున్న మకిలీ 
మనసుని వదిలితే కదా 
భూతల స్వర్గమో ,భావనల
ఆమోదయోగ్యమో తారసిల్లేది.

అదిగో ఎవరో అక్కడ
కోవెలకు దూరంగా నిలబడి
ఆకాశాన్నిచూసే ధైర్యములేక
రొమ్ముకొట్టుకుంటూ, దేవా పాపిని
కరుణింపమని, యదపగిలి యేడుస్తూ!

ఆర్కే||కోవెల||20140717||
బుంగలు-10

Wednesday, 27 February 2013


అమ్మ చూపులో  మా బాగులు
అమ్మే పోగులో మా దారులు

నీ తనువు ముడతలే నాకీ దర్పం సమకూర్చెను
నా మనువు ముడులే నిన్ను దూర పరిచెను

మరు జన్మ వుంటే నీ చెప్పుగా పుడత
అరిగేవేరకు తొక్కుపెట్టు - మల్లి జారితే నీ మీదే వొట్టు

కొడుకు కాని కొడుకు  - కడతేర్చని కొడుకు -కడకు రాని కొడుకు - వట్టి కధకూర్చిన కొడుకు - నీ ఆర్కే

భయముతో ఎందరో నిర్భయులు -
వెళుతున్న నేవెళుతున్న నేను వెళుతునేవున్నా


డిల్లి లోనే కాదు మీ గల్లిలో జరిగినా చూస్తూనే వుండండి ..మీరూ చూస్తూనే వుండండి 
-----------------------------------------------



గుడ్డ కరువై - సిగ్గు బరువై - ఎద్దు మృగమై
బుస్సు బుస్సున బస్సులో పడి రద్దు పరచిన ఓ గడ్డి పూవును
సద్దు చేయక మబ్బు నీడన పొద్దుపోయిన ఓ గాలి బుడగను

నిశిరాత్రిలో విషపురుగుల కసిఆటలో మసిబాసిన మల్లెను నేను 
తరిమి తరిమి తడిమి తడిమి కడలి పాలై హడలి పోయిన చెల్లెను నేను 

జన్మస్తలి రకతపు యేరై మారి రాజనగరి వీధులలో పారి పారి పారుతుంటే 
కొట్టుకుపోతున్న నా ఆడతనాన్ని గిల్లి గిల్లి చిల్లర చేసిన ఓ అల్లరిమూక 
వెళుతున్న నేవెళుతున్న నేను వెలుతునేవున్నా

బ్రతకలేక కాదు బ్రతుకే లేక - తీరుపు రాక - యిక పడిగాపులు కాయలేక 
కినుక వహిస్తున్న ఈ ఇనుప పాలన ఇప్పటికిక ఇమడదని నాకు అమరదని 
వెళుతున్న నేవెళుతున్న నేను వెళుతునేవున్నా

మరిణించిన నాకు మరుజన్మే వుంటే - కరుణించి నీకై మళ్ళి జన్మిస్త 
ఆడతనమంటే ఆడేతనమేకాదు అమ్మతనమని 
నువ్వు చిదిమిన నా మొవ్వు చనుములతో నీకు పాలిస్తూ లాలిస్త 
మోడు చేసిన ఈ బోడి వడిలోనే నా గోడు దెల్పి నిన్ను బోజ్జోపెడత
వస్తా మళ్ళి వస్తా జన్మిస్త నీకు జన్మను నిస్తా

ఇట్లు,
దీవెనలతో నిన్ను ప్రేమిస్తూ మరణిస్తున్న
నాకు అన్ని అయిన నీకు ఏమి కాని నీ నిర్భయను 
వెళుతున్న నేవెళుతున్న నేను వెళుతునేవున్నా

------నీ కన్నీటిసిరానింపుకొని ఒంపుతున్ననీ అన్న ఆర్కే