Friday, 18 July 2014

ఆర్కే||ఆత్మ - దేహం || 

నీలోనే ఉంటాను 
నాతో చెప్పావ్, 

కన్నీటితో కట్టిన మేడ
వడగండ్ల తలుపులు 
కడగండ్ల కిటికీలు
తలగడ దిండ్లన్ని తడుపుతూ "కాపురం"
ఎక్కడూడ్చిన "నీళ్ళే".

రావద్దన్నా వస్తావు నీవు
మనిషిగా కాదు, గుర్తుకి, కేవలం జ్ఞప్తికి,
కొనూపిరితో కొట్టుకుంటున్ననన్ను
కాలగర్భంలో కలిపెయ్యటానికి.

దేహం కాలిపోతుంటే
కనీసం *గంటలకారు
కోసమైనా కబురంపని
ఆత్మ ఉంటే ఏమిటి పోతే ఏమిటి!

పావురం ఎగిరిపోయింది
పంజరం మిగిలి పోయింది
పరస్పర నిందలకు
గమనాగమనాలు మన చేతుల్లో ఉంటేగా!!

సర్వీశ్వర త్రాహిమం
పాహిమాం ఈ శేషం.

ఆర్కే||ఆత్మ - దేహం ||20140716||
బుంగలు-9
--------- -----------------
*గంటలకారు - ఫైరింజన్



ఆర్కే||కోవెల||

కుక్క కాలిడిన మాత్రాన 
కోవెల కల్మషమైపోదు 
యదలో లేని పశ్చాత్తాపం 
ఎదుట పడినప్పుడు చూపెడితే 
అస్తిత్వానికి అది సరిగ్గా అతకబోదు.

మాటలో వదిలించుకున్న మకిలీ 
మనసుని వదిలితే కదా 
భూతల స్వర్గమో ,భావనల
ఆమోదయోగ్యమో తారసిల్లేది.

అదిగో ఎవరో అక్కడ
కోవెలకు దూరంగా నిలబడి
ఆకాశాన్నిచూసే ధైర్యములేక
రొమ్ముకొట్టుకుంటూ, దేవా పాపిని
కరుణింపమని, యదపగిలి యేడుస్తూ!

ఆర్కే||కోవెల||20140717||
బుంగలు-10